Posts

Showing posts from April, 2024

Chinthala Upender Reddy's Strategic Meeting with CM Revanth Reddy

Image
 భువనగిరి ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి మోత్కూర్... కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ని ఎమ్మెల్యే లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొని భువనగిరి లోక్ సభ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం సూచనలు చేసినట్లు తెలిపారు.తెలంగాణ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపాలన ను ప్రజలు హర్షిస్తున్నారని,పార్లమెంట్ ఎన్నికల లో సైతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుపొందేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు.