చింతల ఉపేందర్ రెడ్డికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, జాతీయ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ.

మోత్కూర్, జూన్ 9 (డైలీ న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చింతల ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు జాతీయ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన చింతల ఉపేందర్ రెడ్డి రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషిస్తూ యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యమైన పదవిని అందుకోవడం మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.ఇతని నాయకత్వ నైపుణ్యం, కృషి, పార్టీ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించినట్టు సమాచారం. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉపేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.



Comments

Popular posts from this blog

Chinthala Upender Reddy Senior Leader In Congress Party

Chinthala Upender Reddy's Strategic Meeting with CM Revanth Reddy

Chinthala Upender Reddy has been appointed as the TPCC State General Secretary and the National Congress Committee has issued orders.