భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి పి సి సి రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి
భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి పి సి సి రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి Chinthala Upender Reddy
.... కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చింతల ఉపేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గారెంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే భువనగిరి పార్లమెంట్ పరిధి గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని లక్ష్యంగా కార్యకర్తలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు . ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య తదితరులు ఉన్నారు.


Comments
Post a Comment